దొడ్డి దారిన సర్టిఫికెట్లతో పదవులు దోపిడీ -గౌడ్ కుల దృవీకరణ పత్రాలను దుర్వినియోగం చేయకండి : గౌడ్ సంఘం నేతలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : స్థానిక సంస్థల ఎన్నికల వేళ తిరుపతి జిల్లాలో ఈడిగ, గౌడ కుల ధ్రువీకరణ పత్రాల దుర్వినియోగం కలకలం రేపుతోంది. అగ్రకులాలకు చెందిన కొందరు వ్యక్తులు దొడ్డిదారిలో ఈడిగ, గౌడ్ కుల సర్టిఫికెట్లు సంపాదించి, రిజర్వేషన్ పదవులను అక్రమంగా అనుభవిస్తున్నారని తిరుపతి జిల్లా ఈడిగ గౌడ సంఘం నేతలు ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ కుల ధ్రువీకరణ పత్రాలను దుర్వినియోగం చేయవద్దని తిరుపతి జిల్లా ఈడిగ గౌడ సంఘం అధ్యక్షులు నడవాటి మల్లికార్జున గౌడ్ కుల సంఘ నాయకులకు సూచించారు. కొంతమంది దొడ్డిదారిలో తమ గౌడ్ కుల ధ్రువీకరణ పత్రాలు పొంది పదవులు అనుభవిస్తున్న వారిపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని, అటువంటి వ్యక్తులపై న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ పత్రం కోసం కావాలని ఎవరైనా అడిగితే క్షుణ్ణంగా పరిశీలించి సంఘం లెటర్లు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు పి.చిరంజీవులు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గౌడ్, తిరుపతి సిటీ అధ్యక్షులు మునిశేఖర్ గౌడ్, కోశాధికారి రామారావు గౌడ్, జి.మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్