BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

తహసిల్దార్ కార్యాలయంలో కమనీయ తెలంగాణ సంస్కృతి అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
తహసిల్దార్ కార్యాలయంలో కమనీయ తెలంగాణ సంస్కృతి   అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు

అమీన్పూర్; తహసిల్దార్ కార్యాలయంలో సాధారణంగా రికార్డులు, అర్జీలు, ప్రజల సమస్యలతో బిజీ బిజీగా ఉండే వాతావరణముంటుంది. అలాంటి చోట బతుకమ్మ పండుగ ను ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మలకు తహసిల్దార్ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.కార్యాలయంలో మహిళా ఉద్యోగులందరూ ఐక్యంగా సాంప్రదాయ దుస్తులో హాజరై బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మురిపించిన పూల అమరిక, తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, బంతిపూలతో ఆఫీస్ ఆవరణలో ఆకర్షణీయమైన బతుకమ్మలను స్వయంగా పేర్చి పండుగ శోభను తెచ్చారు. ఆకట్టుకున్న బతుకమ్మ ఆటలు, ఆఫీస్ విధుల ఒత్తిడిని పక్కనపెట్టి మహిళా సిబ్బంది అందరూ ఒకే వలయంగా ఏర్పడి జానపద పాటలకు అనుగుణంగా బతుకమ్మ ఆడడం విశేషంగా నిలిచింది. సమైక్యత సాంస్కృతిక బంధం, హోదాలు రాతకోతలు సరిహద్దులు దాటి ఒకే కుటుంబంలో పండుగ చేసుకోవడం ద్వారా ఉద్యోగుల మధ్య ఐక్యత సోదరీబావం మరింత బలపడ్డాయని పేర్కొన్నారు. సందర్భంగా తహసిల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ.... తెలంగాణ సంస్కృతికి ప్రతీక ప్రకృతిని పూలను పూజించే తెలంగాణ విశిష్ట సంస్కృతికి బతుకమ్మ పండుగ నిదర్శనమని ఇటువంటి వేడుకలు ఉద్యోగుల మధ్య సోదర భావని పెంచుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.