సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి: నిర్మల్ జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా డి. వెంకట మాధవ రావు శుక్రవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అదనపు కలెక్టర్కు పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.