BREAKING
ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట

నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం

Select Suryaa Now
నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌  -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం

పటాన్‌చెరు;పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో గౌడ్‌ విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన హాస్టల్‌ భవనాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో హాస్టళ్లు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ చదువుపై దృష్టి సారించేందుకు ఇటువంటి వసతి గృహాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.గౌడ్‌ విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన వసతి, విద్యా సదుపాయాల కల్పనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.నందిగామలో నూతన హాస్టల్‌ భవనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు వసతి పరంగా మరింత ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ్‌ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.