BREAKING
సుంకరి నరసయ్య మృతి బాధాకరం నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. భారత్‌లో వైభవంగా వివర్స్ కాన్ ఫెస్టివల్ అరంగేట్రం.. క్యూ-పాప్ దిగ్గజాల లైన్‌అప్ ఖరారు రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక *తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్* *రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం* ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..... అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. *శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు* మారిన రాజకీయ సమీకరణాలు.. వైసీపీతో సిపిఐ పొత్తు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి.. టాలీవుడ్ పరిస్థితులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు *గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు* ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

*ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి*

Select Suryaa Now
*ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి*

నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మ), నారాయణఖేడ్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను కొనియాడారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, మహిళలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తరతరాలకు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో: మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్ లు బి.రాజు, షారుఖాన్, సుబుర్, మహేష్ చౌహన్ వివేకానంద, లక్ష్మణ్ , ముంతాజ్ సెట్, మొహీద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు, పండరి రెడ్డి నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాహెర్ అలీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మెప్మ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, పట్టణ మహిళలు తదితరులు పాల్గొన్నారు.