గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం
గ్రామ కార్మికులకు పండుగ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ కడారి శేఖర్ యాదవ్
తలకొండపల్లి, రంగారెడ్డి :జూలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కడారి శేఖర్ యాదవ్, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ కార్మికులకు ముందస్తుగా పండుగ చీరలను పంపిణీ చేశారు. పండుగ వేళ గ్రామ కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలనే ఉద్దేశంతో చీరలను అందజేశారు. గ్రామ పరిశుభ్రతతో పాటు ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను గౌరవించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం అనే స్ఫూర్తితో గ్రామపంచాయతీ పాలకవర్గం ముందుకు సాగుతోందని తెలిపారు. రాబోయే దసరా పండుగ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడారి శేఖర్ యాదవ్, ఉపసర్పంచ్ ఇంద్రకంటి శ్రీశైలం గౌడ్, వార్డు సభ్యులు రాఘవేందర్ ముదిరాజ్, అల్లాజీ గౌడ్, జగదీష్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,APM రామస్వామి, శ్రీశైలం, రాములు గ్రామ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి మేజర్ న్యూస్.