BREAKING
సుంకరి నరసయ్య మృతి బాధాకరం నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. భారత్‌లో వైభవంగా వివర్స్ కాన్ ఫెస్టివల్ అరంగేట్రం.. క్యూ-పాప్ దిగ్గజాల లైన్‌అప్ ఖరారు రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక *తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్* *రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం* ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..... అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. *శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు* మారిన రాజకీయ సమీకరణాలు.. వైసీపీతో సిపిఐ పొత్తు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి.. టాలీవుడ్ పరిస్థితులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు *గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు* ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి

Select Suryaa Now
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి

సూర్యజూలూరుపాడు,ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జూలూరుపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు.శుక్రవారం సిరిపురపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సీపీఐ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.రైతులు ఇప్పటికే పంటల సాగుకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారని,వర్షాలు లేక ఆశించిన దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందని,అనేక మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని నరేంద్ర కుమార్ తెలిపారు.చెరువులు,కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలమట్టం కనిష్ఠ స్థాయికి పడిపోతోందన్నారు.

గోదావరి జలాలతో చెరువులు నింపాలి

రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని నరేంద్రకుమార్ కోరారు. గోదావరి జలాలను జిల్లాకు అందించే ప్రక్రియను వేగవంతం చేసి,సాధ్యమైనంత మేరకు చెరువులు,కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. కరువు పరిహారాన్ని వెంటనే అందించి రైతులకు అండగా నిలవాలన్నారు.పత్తికి కనీస మద్దతు ధరగా క్వింటాకు రూ.13 వేలు చెల్లించాలని కోరారు.ఇతర రాష్ట్రాలు కరువు పరిస్థితులను గుర్తించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతుండగా..తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా స్పందించడం లేదని చండ్ర విమర్శించారు.ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు,ఎస్‌కే నాగుల్‌మీరా,యల్లంకి మధు,పొన్నెకంటి వెంకటేశ్వర్లు,గుండెపిన్ని మధుసూదన్‌రావు,కంచర్ల రాఘవేంద్రరావు,వల మల్ల సామేలు,హలావత్ బద్రు,కొండ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ సిద్ధిక్ జూలూరుపాడు