రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం!
రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం!
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. దీంతో వాహనదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, నీటి నిల్వల సమస్యను రేణిగుంట గ్రామ పంచాయతీ పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.