సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం
సీతమ్మధార, సూర్య : విశాఖపట్నం ప్రభుత్వ చాతీ అంటువ్యాదుల ఆసుపత్రి (టి.బి.హాస్పిటల్) లో సంజీవని ఛాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు మాట్లాడుతూ ఈ సంజీవని ప్రోగ్రాం ప్రధాన లక్ష్యం వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ, ఉచిత వైద్య పరీక్షలు, ప్రతీ పౌరునికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియెట్ చేసి ఇంటి వద్దనే వైద్యం అందించే విధంగా ప్రణాళిక అని డిసెంబర్ 10 వ తేది నుండి అన్ని పట్టణ/ప్రాధమిక ఆరోగ్య కేంద్రముల నుండి ఈ సంజీవని సేవలు అందుబాటులోకి వస్తుందని తెలియచేసారు. ఈ సమావేశం లో టాటా గ్రూప్ ఎం.డి. డా.శ్రీకాంత్ , టీం, స్టేట్ నోడల్ అధికారి సృజన విశాఖపట్నం జిల్లా నోడల్ అధికారి డా.బి.ఉమావతి బృందం విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం పార్వతీపురం జిల్లాల నుండి డి.ఎం.హెచ్.ఒ.లు, డి.పి.ఎం.ఒ.లు, జిల్లా ప్రోగ్రాం అధికారులు,అసిస్టెంట్ మలేరియా అధికారి .బి.నాగభూషణం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.