సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్
సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్
కొత్తగూడెం సింగరేణి,సూర్య(మేజర్ న్యూస్)- సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో పనిచేసే ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల కొరకు బర్మాక్యాంప్లో నూతనంగా నిర్మించిన ఎంసీ, ఎండీ టైప్ క్వార్టర్ల కేటాయింపునకు శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో క్వార్టర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 92 క్వార్టర్లకు (ఎంసీ-50, ఎండీ-42) గాను 299 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, వారి అర్హత, కేటగిరి, పదవిని బట్టి పూర్తి పారదర్శకంగా క్వార్టర్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) బి. శివ కేశవ రావు, డీవై.పీఎం కే. సునీల్ కుమార్, డీవై.ఎఫ్ఎం శ్రీమతి సంధ్యా రాణి, ఎంటీ (సివిల్) సాయి కిరణ్, జూనియర్ అసిస్టెంట్ ఎం. మౌనిక, ఆఫీస్, సెక్యూరిటీ సిబ్బంది, కౌన్సిలింగ్కు హాజరైన ఉద్యోగులు పాల్గొన్నారు.