మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
టి.నరసాపురం,సూర్య క్రైమ్ న్యూస్:వీరభద్రవరం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమల మండలం సత్తాల గ్రామానికి చెందిన కత్తి శాంతి (26)కి వీరభద్రవరం గ్రామానికి చెందిన శేషుతో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శాంతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
క్రైమ్ రిపోర్టర్ :అద్దంకి గిరి కుమార్, ఏలూరు జిల్లా,