ఘనముగా సరస్వతీ పూజ
గజపతినగరం, సూర్య : స్థానిక దిగువ వీధిలో గల శ్రీ పైడితల్లి అమ్మవారి గుడిలో శరన్నవరాత్రులు సందర్భంగా శుక్రవారం సరస్వతీదేవి పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కందుల వెంకట చిన్నయ్య స్వామి ఆధ్వర్యంలో సుమారు 100 మంది బాల,బాలికలు ఈ ప్రత్యేక పూజలు పాల్గొనగా వారందరికీ కందుల వెంకట చిన్నయ్య స్వామి పూజా సామాగ్రి అందజేశారు. బాల, బాలికలు కు మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.