చిల్లర రాజకీయాలు మానుకో ప్రతాప్ రెడ్డి
గజ్వేల్ .బిఆర్ఎస్ నాయకుడు ప్రతాప్ రెడ్డి ఓ గల్లీ లీడర్ గా అవతారమెత్తి సమీకృత కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న రోజువారీ కూలీలకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని దుష్ప్రచారం మానుకో మొదలు వారితో మాట్లాడి తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది వారికి రెండు నెలలు అంటే ఆగస్టు సెప్టెంబర్ మాత్రమే వారికి బాకీ ఉన్నది నువ్వు నిన్న మార్కెట్ సందర్శించక ముందే వారికి రెండు నెలలు అంటే జూన్ జూలై సంబంధించిన అమౌంట్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి వారికి చెల్లించడం జరిగింది . మధ్యాహ్నం నీవు వచ్చి వారికి ఆరు నెలల నుంచి జీతాలు రావడం లేదని గల్లి లీటర్ గా చిల్లర వేషాలు వేస్తున్నావ్ నీకు ఏ హోదాతో మార్కెట్ను సందర్శించావు గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది . ఈ సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. గజ్వేల్ సమీకృత మార్కెట్ కట్టటానికి ఇతర మార్కెట్ల నుండి 10 కోట్ల 70 లక్షలు అప్పులు తీసుకొని కట్టించారు కానీ ఇందులో పని చేసే వారికి పర్మనెంట్ సోర్స్ కల్పించక రోజువారి కూలీలుగా మిగిల్చారు ఇదే సిద్దిపేటలో మాత్రం రైతు బజార్ కట్టి కలెక్టర్ ద్వారా వారికి జీతాలు ఇప్పిస్తున్నారు ఇదే గజ్వేల్ మార్కెట్ కి ఇలాంటి స్పోర్ట్స్ ఎందుకు కల్పించలేదు మీ చేతకానితనంతో గజ్వేల్ పై మీకు ఉన్న సవతి తల్లి ప్రేమతో ఇప్పుడు మార్కెట్ లో పనిచేసే కూలీలకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కాదా ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో పడుకొని నువ్వు చిల్లర వేషాలు వేస్తే గజ్వేల్ ప్రజలు క్షమించరు.