BREAKING
సుంకరి నరసయ్య మృతి బాధాకరం నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. భారత్‌లో వైభవంగా వివర్స్ కాన్ ఫెస్టివల్ అరంగేట్రం.. క్యూ-పాప్ దిగ్గజాల లైన్‌అప్ ఖరారు రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక *తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్* *రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం* ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..... అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. *శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు* మారిన రాజకీయ సమీకరణాలు.. వైసీపీతో సిపిఐ పొత్తు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి.. టాలీవుడ్ పరిస్థితులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు *గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు* ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష

Select Suryaa Now
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష

*నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష*

*పెండింగ్ పనులను వేగవంతం చేయాలి – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి*

*ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి*

నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని,వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల అవసరాలను గుర్తించి వాటికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై నిరంతరం దృష్టి సారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, శేఖర్ రెడ్డి, కుమారస్వామి గౌడ్, రమేష్, రాయికల్ శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి, జాకారం శేఖర్, శ్రీధర్, ఆర్డీఓ సరిత, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.

జవాజి రాఘవేంద్ర గౌడ్ మేజర్ న్యూస్ షాద్ నగర్