టీడీపీ తీర్థం పుచ్చుకున్న పట్టణంలోని 30 కుటుంబాలు
చీపురుపల్లి మేజర్ న్యూస్:
వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి పట్టణంలోని సుమారు 30 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరారు. లావేరు రోడ్డు వీధికి చెందిన రఘుపాత్రుని శివ ప్రసాద రావు, కింతలి మధుసూదన రావు చంటి, శ్రీనివాస రావు, రవి కుమార్, చంద్ర శేఖర్, వెంకట రమణ, గార సురేష్ కుమార్, చల్లా వెంకటేశ్వర్లు, బర్ల ఆదినారాయణ, సీమశెట్టి సత్యా రావు పాటు 20 కుటుంబాలు శాసన సభ్యులు కిమిడి కళా వెంకట రావు గారి సమక్షంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే కళా వెంకటరావు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, దన్నాన రామచంద్రుడు, ఇజ్జిరోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మధు, సూర్య, చీపురుపల్లి