చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి
రేగిడి, సూర్య : రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ హనుమాన్ పేట లో దాసరి భవన్ లో వెలగపూడి ఆజాద్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన మాట్లాడారు. పక్కరాష్ట్రాల వలె టన్ను చెరకు కు 500రూపాయలు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. పెరిగిన పంచదార ధరకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను టన్నుకు 5వేలు రూపాయలు ఇవ్వాలన్నారు. చెరకుపంటకు కావలసిన ఆధునీకరణ యంత్ర పరికరాలు సబ్సిడీ తో రైతులకు సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశం లో వివిధ సంఘాలు, ఫ్యాక్టరీ లో పరిధిలో ప్రముఖులు, రైతులు పాల్గొని మాట్లాడారు.ఈ సమావేశం లో పలు తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఈ సమావేశం లో రైతు సంఘం నాయకులు వి.కేశవరావు,బుడితి అప్పలనాయుడు, ఎన్.సూర్యప్రకాశ్, పై.జమలయ్య, వెంకట రెడ్డి, సత్య వెంకటేశ్వర శర్మ, తిమ్మారెడ్డి, వేమూరి రత్నగిరి, అప్పలరాజు, నాగేశ్వరరావు, మాధవ రావు, రఘు, మందార రావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రాము నాయుడు, రేగిడి, విజయనగరం జిల్లా.