BREAKING
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక

అరసాడ లో పల్లె నిద్ర కార్యక్రమం... ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వంగర ఎస్సై షేక్ శంకర్

Select Suryaa Now
అరసాడ లో పల్లె నిద్ర కార్యక్రమం...  ప్రజలకు  అవగాహన కల్పిస్తున్న వంగర ఎస్సై షేక్ శంకర్

వంగర, సూర్య : వంగర మండలం అరసాడ గ్రామంలో శుక్రవారంనిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో వంగర ఎస్సై షేక్ శంకర్  గ్రామ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై షేక్ శంకర్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువ కావడం, గ్రామస్థుల సమస్యలను తెలుసుకోవడం పల్లె నిద్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించారు.

రిపోర్టర్ : దుర్గా ప్రసాద్, వంగర, విజయనగరం జిల్లా.