BREAKING
గంభీరావుపేట ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ గాయపడిన కార్యకర్తకు అండగా కేతిరెడ్డి జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం మిర్యాలగూడ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త

Select Suryaa Now
ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: ప్రజల ఆశీస్సుల కొరకు తెలుగుదేశం పార్టీ మీ ఇంటికి ప్రతి ఇంటికి వస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. శుక్రవారం నందికొట్కూరు మున్సిపాలిటీ లోని రాజా వీధి, బ్యాంకు ఏరియా మరియు పదో వార్డులలో   నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య , నంద్యాల తెదేపా పార్లమెంటు ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డిలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో కోట వీధిలో  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో టీడీపీ నాయకులు మాండ్ర శివానంద రెడ్డి తో కలిసి పూజలు నిర్వహించారు.అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఎవరైనా సరే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల పైన ఉందన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇస్తే కానీ ఎస్సీ, బీసీ ,బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం ఇచ్చింది మన ముఖ్యమంత్రి అన్నారు. ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. నందికొట్కూరు పట్టణం నందనవనంగా తయారవుతుంది అన్నారు. ప్రజలందరూ గమనించుకొని ప్రశాంత వాతావరణంలో ఒక మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుని పట్టణ అభివృద్ధికి కృషి చేసుకున్నట్లయితే అందరూ కూడా ముందుకు వెళ్లినట్లు అవుతుందన్నారు. పార్టీ కూడా అందరి అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ ముగుస్తుందని త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పైన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ప్రతి కార్యకర్త ,నాయకుడు పని చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు లాయర్ జాకీర్, మద్దిలేటి, గుంజు పల్లె భాస్కర్ రెడ్డి, ముర్తుజావలి, బోయ శేఖర్, గని, డాక్టర్ వనజ టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.