BREAKING
*గవర్నర్ కోటాలో నీలం మధుకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలి* *- జిన్నారం మండల ఎన్‌ఎం‌ఆర్ యువసేన నాయకుడు గణేష్ డిమాండ్* అరసాడ లో పల్లె నిద్ర కార్యక్రమం... ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వంగర ఎస్సై షేక్ శంకర్ శాంతినగర్ దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల భారీ వర్షానికి తమిళనాడు చెన్నైలో జలమయమైన రహదారులు చిర్రగూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* -సర్పంచ్ చిత్తలూరు సోమనారాయణ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ *కోహీర్ మండలం కొత్తూరు (కె) గ్రామంలో డివిజన్ స్థాయి భూ పునఃసర్వే శిక్షణ* *భూ సర్వేలో ఖచ్చితత్వం.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం* సరస్వతి దేవి అవతారంలో పోలమాంబ త్రిముఖదుర్గాంబ సన్నిధిలో టిడిపినేత మన్నేపల్లికార్తీక్: ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు దొడ్డి దారిన సర్టిఫికెట్లతో పదవులు దోపిడీ -గౌడ్ కుల దృవీకరణ పత్రాలను దుర్వినియోగం చేయకండి : గౌడ్ సంఘం నేతలు జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు ది బ్యాట్మన్ పార్ట్ 2 షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన మ్యాట్ రీవ్స్.. సహాయం అందించనున్న స్టీవెన్ సోడర్‌బార్క్ భైరవకోనలో గజలక్ష్మిదేవిగా త్రిముఖదుర్గాదేవి: ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై దృష్టి సారించాలి... ఎన్‌సీడీ జిల్లా అధికారి డాక్టర్ జగన్ మోహన్

లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత

Select Suryaa Now
లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత
 
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి :  ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని  సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శుక్రవారం రోజున ఆదిలాబాద్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తో కలిసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన నూతన బార్ ను లక్కీ లాటరీ పద్ధతిలో కేటాయింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి నూతన బార్ అండ్ రెస్టారెంట్ మంజూరు కాగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, మొత్తం 207 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారి సమక్షంలో లక్కీ లాటరీ పద్ధతిన 102 నెంబరు గల మల్లు గారి రమేష్ గౌడ్ ను లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బార్ నిర్వహణలో ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటిస్తూ, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ మధ్య నిషేధశాఖ అధికారి లక్ష్మీ నాయక్, సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.