బాధితురాలికి మొబైల్ ఫోన్ అప్పగింత
సూర్య టేకులపల్లి,టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన కొట్టే. జ్యోతి ఆరు నెలల క్రితం టేకులపల్లి సంతలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను పోలీసులు గుర్తించి తిరిగి ఆమెకు శుక్రవారం అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ను ట్రేస్ చేసిఅందజేసినట్లు టేకులపల్లి ఎస్ఐ. కె. తిరుపతి. తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్ను తిరిగి అందించడంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
సూర్య రిపోర్టర్ దసురు టేకులపల్లి