telanagana
అమీనాపూర్లో పిచ్చికుక్క స్వైరవిహారం - ఆరుగురిపై దాడి
సూర్య వేల్పూరు 01
వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడికి పాల్పడింది. వీధుల్లో తిరుగుతూ కంటపడిన వారిపై అకస్మాత్తుగా దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.పిచ్చికుక్క దాడిలో బంగ్లా నర్సా గౌడ్, అవును లోకేష్, పాకాల శ్రీనివాస్ గౌడ్, తోకల మధునిత, శివన్షి, వర్ధన్ గాయపడినట్లు సమాచారం. బాధితుల శరీరాలపై లోతైన గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందించారు.