BREAKING
కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గంభీరావుపేట ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ గాయపడిన కార్యకర్తకు అండగా కేతిరెడ్డి జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు

కాగజ్‌నగర్‌లో ఉచిత వైద్య సేవలు - సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్

Select Suryaa Now
కాగజ్‌నగర్‌లో ఉచిత వైద్య సేవలు - సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్
సూర్య, కాగజ్‌నగర్:ఖరీదైన వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ఆశాకిరణంగా నిలుస్తోంది. వైద్య సేవలను సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ రైలు ఆసుపత్రి ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు, అవసరమైన శస్త్రచికిత్సలను ఉచితంగా అందించనున్నారు. ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పిలుపునిచ్చారు.   కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత శస్త్రచికిత్సలు, చిన్నారులకు సంబంధించిన ఎముకల ఆపరేషన్లు, ప్లాస్టిక్ సర్జరీలు ఉచితంగా నిర్వహించనున్నట్లు వివరించారు.డబ్బుల కొరతతో వైద్యానికి దూరమవుతున్న పేదలకు ఇలాంటి సేవలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సేవల గురించి తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవలపై కాగజ్‌నగర్ పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిడం నాగేంద్ర, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. అవినాష్‌లకు సూచించారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత, సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, తహసీల్దార్ మల్లెపూల మధుకర్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టీ డా. రోహిణి చౌగులే, రోగులు, వారి బంధువులు తదితరులు పాల్గొన్నారు.