telanagana
మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి రూ.లక్ష ఎక్స్గ్రేషియా
సూర్య వేల్పూరు 03 : వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గుండేటి నవీన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఎక్స్గ్రేషియా మంజూరుకు సంబంధించిన ఎఫ్టీఓ ను ఈరోజు జారీ చేశారు.మరణించిన నవీన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే ప్రక్రియలో భాగంగా ఈ ఎక్స్గ్రేషియా ఎఫ్టీఓ జారీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తీట్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ నేరెళ్ల చిన్న రాజేశ్వర్, ఎంపీడీఓ రఘురామ్, ఏపీఓ అశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికుమార్, కరోబార్ చిట్టిబాబు పాల్గొన్నారు.