అంతంపల్లి దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం
సూర్య- బిక్కనూర్ : మండలంలోని అంతంపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని, గ్రామ సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. కాగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మధు ఉపేందర్ రెడ్డి, మమత ప్రవీణ్ రెడ్డి లను అభినందించారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు తరలివచ్చారు