BREAKING
కాగజ్‌నగర్‌లో ఉచిత వైద్య సేవలు - సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్ యాసంగిలో వరి సాగును తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయండి కాంగోలో మారుతున్న తిరుగుబాటు వ్యూహాలు నల్లేరు కారం పొడితో కీళ్ల నొప్పులు పరార్.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయా? ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని ఘనముగా సరస్వతీ పూజ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు* ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్జా గింజలతో బరువు తగ్గుతారా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు! లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి

బ్యాడ్మింటన్ క్రీడలకు తణుకును ప్రత్యేక వేదికగా తీర్చిదిద్దాలి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం త్వరలో ఏడు బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులోకి గోపీచంద్, పీవీ సింధులను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

Select Suryaa Now
బ్యాడ్మింటన్ క్రీడలకు తణుకును ప్రత్యేక వేదికగా తీర్చిదిద్దాలి  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం  త్వరలో ఏడు బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులోకి  గోపీచంద్, పీవీ సింధులను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు, సూర్య న్యూస్ :బ్యాడ్మింటన్ క్రీడల్లో తణుకుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.

శుక్రవారం స్థానిక కొండేపాటి సరోజినీ దేవి మహిళా కళాశాలలో నిర్వహించిన అండర్‌-17 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆయన పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే తణుకు నుంచి మరింతమంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆకాంక్షించారు.క్రీడాభివృద్ధిలో భాగంగా తణుకు మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఇప్పటికే రెండు బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో ఉన్నాయని, శాప్ నిధులతో మరో రెండు కోర్టులను నిర్మించి రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇతర కోర్టులతో కలిపి పట్టణంలో మొత్తం ఏడు బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు.తణుకు ప్రాంతానికి చెందిన హేమశ్రీ ఆసియా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజయం సాధించడం స్థానిక క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. గోపీచంద్, పీవీ సింధు వంటి దిగ్గజ క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.క్రీడల్లో గెలుపోటముల కంటే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓటములను విజయానికి సోపానాలుగా మలుచుకోవాలని, తల్లిదండ్రులు సైతం పిల్లల్లోని క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.బ్యాడ్మింటన్ అభివృద్ధికి కృషి చేస్తున్న నిర్వాహక కార్యదర్శి సతీష్‌బాబు, కోచ్‌ల సేవలను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో బ్యాడ్మింటన్ క్రీడలకు తణుకు ఒక ప్రత్యేక కేంద్రంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు.

రిపోర్టర్. అనుకుమార్..తణుకు. ..పశ్చిమగోదావరి జిల్లా.