BREAKING
వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పట్టణంలోని 30 కుటుంబాలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష

మున్సిపాల్టీల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం

Select Suryaa Now
మున్సిపాల్టీల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం, సూర్య : విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయితీలో నామినేష‌న్ల ప్ర‌క్రియ శుక్ర‌వారం ప్రారంభ‌మ‌య్యింది. ఆయా మున్సిపాల్టీల రిట‌ర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేసిన వెంట‌నే, నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. మేయ‌ర్‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌టంతో, వార్డు స‌భ్యుల‌తోపాటు, మేయ‌ర్‌, ఛైర్మ‌న్ స్థానాల‌కు కూడా వేరుగా నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌డానికి ప్ర‌త్యేకంగా కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని 62 వార్డుల‌కు, మేయ‌ర్ ప‌ద‌వికి వేర్వేరుగా నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తున్నారు. అలాగే బొబ్బిలి మున్సిపాలిటీ ప‌రిధిలో 36 వార్డుల‌కు, ఛైర్మ‌న్ ప‌ద‌వికి, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయితీలోని 23 వార్డుల‌కు, ఛైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వికి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది.  
మొద‌టిరోజు విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌లో మేయ‌ర్ స్థానానికి ఒక నామినేష‌న్‌, వార్డు స‌భ్యుల‌కు 18 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. బొబ్బిలిలో వార్డు స‌భ్యుల స్థానాల‌కు 6 నామినేషన్లు వ‌చ్చాయి. నెల్లిమ‌ర్ల‌లో ఛైర్మ‌న్ స్థానానికి రెండు, వార్డు స‌భ్యుల స్థానాల‌కు 8 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 18 చివరి తేదీ. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయి. అక్టోబర్ 28న పోలింగ్, అవసరమైన చోట అక్టోబర్ 29న రీపోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్‌లో నామినేష‌న్ల ప్ర‌క్రియ కోసం చేసిన ఏర్పాట్ల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి శుక్ర‌వారం ప‌రిశీలించారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌, ఇత‌ర‌ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌కు అనుగుణంగా ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని, నిబంధ‌న‌ల‌కు ఎక్క‌డా ఉల్లంఘించ‌కూడ‌ద‌ని ఆదేశించారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఖ‌ఛ్చితంగా అమ‌లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.
 

రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.