శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా మూలా నక్షత్ర వేడుకలు
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా మూలా నక్షత్ర వేడుకలు
పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ :
శ్రీ దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, నిత్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా సరస్వతీ దేవి అలంకరణ చేసి, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు.అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి, పెన్నులు, పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో జంగం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ లక్ష్మణ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బద్దుల కృష్ణ మనోహర్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
ముక్కు ప్రశాంత్ పెనుగంచిప్రోలు