జనసేనకు ఝలక్.....* జిల్లాలో నో చాన్స్
విజయనగరం, సూర్య : కూటమి పవర్ లో ఉన్నా ఇక్కడ మాత్రం అయ్యో జనసేన అన్నట్టు గానే ఉంది. ఇంత వరకు అదిగో...ఇదిగో అంటూ జన సైనికుల్ని ఊరిస్తూ వచ్చిన చివరకు స్థానిక ఎన్నికలు వచ్చేసరికి జనసేనకు జిల్లాలో గట్టి ఝలక్ ఇచ్చారు. కూటమి పొత్తు లో విజయనగరం మేయర్ పీఠం ఆశించి భంగపడ్డ చివరకు నెల్లిమర్ల వస్తుంది అంటూ మొదటి నుంచి ప్రచారం సాగిన చివరకు అక్కడ కూడా నో చెప్పి ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ కి అవకాశం ఇవ్వడంతో అంతా ఖంగుతిన్నారు. జనసేన సామాజిక, ఆర్థిక, అంగబలం ఉన్న వారు ఉన్నా కనీసం పరిగణలోకి తీసుకోకపోవడంపై అంతా మండిపడుతున్నారు. తాము పల్లకి మోసే వారిగానే కూటమి లో తమ తీరు ఉందని పలువురు మండిపడుతున్నారు. మరో పక్క నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యినా కనీసం ఎన్ని డివిజన్లు ఇస్తారో అసలు ఇవ్వరో తెలీని అయోమయ పరిస్థితి నెలకొందనీ పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపునకు అంతా శ్రమించినా ఇక్కడ మాత్రం కూటమి ధర్మం పాటించడం లేదని అసలు జనసేనను పట్టించుకొని పరిస్థితి విజయనగరంలో ఉందని పలువురు మండిపడుతున్నారు. బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నా వారికి అన్యాయం చేసేలా రిజర్వేషన్లు మార్చి పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధినేతలు ప్రకటనలకు, చర్యలకు పొంతన లేకుండా పోతోందని వాపోతున్నారు. ఇదిలా ఉంటే తమకు కనీసం కార్పొరేటర్ల టిక్కెట్లు ఇవ్వక పోతే ఇక తాడో పేడో తేల్చుకుంటామని అవసరమైతే రాజీనామాలు చేస్తామని తెలియ జేస్తున్నారు. అధిస్థానం ఇప్పటికైనా మేల్కొక పోతే ముప్పు తప్పదని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.