BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేయటం అమానుషం -బతుకమ్మ వేడుకలకు ముస్తాబవుతున్న సంగారెడ్డి కింది బజార్ చెరువు కట్ట - సదాశివపేట మండలం రేజింతల్‌లో బతుకమ్మ ఘాట్‌ను ప్రారంభించిన నిర్మలా జగ్గారెడ్డి,తోపాజి నెల్లిమర్ల రాజకీయాల్లో ఊహించని పరిణామం.... * చైర్మన్ సీటుపై ధీమా బంగారు మైసమ్మకు బండ్లు,బోనాలు దుర్గామాత మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం మూలా నక్షత్రం వేళ అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు ఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం చల్లా సునీల్ పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది.. నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖ్యలు భక్తులతో కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు గీతంలో ఘనంగా దండియా ఉత్సవం -‘శుభారంభ్–2026’ పేరిట గర్బా, దండియా నృత్యాలు -సంప్రదాయ వస్త్రధారణలో వేలాది మంది విద్యార్థుల సందడి గెలుపే లక్ష్యంగా పనిచేయండి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ కౌన్సిలర్ బట్టు శ్వేతా దంపతులు పండగ పూట పస్తులేనా? కార్మికుల ఆవేదన! లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ సరికొత్త హంగులతో లోహ మార్కెట్లో విస్తరణ వైసిపి నిజమైన గొడ్డలి పార్టీనే... -గొడ్డలి పార్టీ మళ్ళీ రక్తపు రాజకీయం- ప్రజాస్వామ్యంపై దాడి -నామినేషన్ అంటేనే వైసీపీకి భయం-అందుకే కర్ణాటక రౌడీలతో దాడులు మిథున్ రెడ్డి ప్రజలపై వాహనాలతో తొక్కారు- ఇది రాజకీయమా? రౌడీయిజమా? -రాజారెడ్డి రాజ్యం అంతమైంది-ఇది చంద్రబాబు, పవన్ కల్యాణ్ యుగం -సై అంటే సై-ఇక ఇక త

పీటీసీ సందర్శించిన డీఐజీ విశాల్ గున్ని

Select Suryaa Now
పీటీసీ  సందర్శించిన డీఐజీ విశాల్ గున్ని

విజయనగరం, సూర్య : పోలీస్ శిక్షణా కళాశాల (పీటీసీ), విజయనగరాన్ని సందర్శించి, కళాశాలలోని వివిధ విభాగాలు, పరిపాలనా కార్యాలయం, తరగతి గదులు, శిక్షణా మైదానం, అధికారుల లాంజ్ తదితర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిపాలనా కార్యాలయంలో నిర్వహిస్తున్న విధులు, రికార్డుల నిర్వహణ, తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న బోధనా సదుపాయాలు, శిక్షణా మైదానంలో నిర్వహిస్తున్న శారీరక శిక్షణా కార్యక్రమాలు, అధికారుల లాంజ్ నిర్వహణను ఆయన సమీక్షించారు. అలాగే కళాశాలకు అనుబంధంగా ఉన్న వివిధ విభాగాల పనితీరు, శిక్షణా కార్యక్రమాల అమలు, శిక్షణార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

కళాశాలలోని వసతులు, నిర్వహణ, శిక్షణా కార్యక్రమాల పట్ల డీఐజీ విశాల్ గున్ని  సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ శిక్షణను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మరింత ఆధునికీకరించాలని, శిక్షణార్థులకు సంప్రదాయ పోలీసింగ్‌తో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు (Cyber Crime), సైబర్ భద్రత (Cyber Security), కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI), CCTNS, డిజిటల్ పోలీసింగ్, ఆన్‌లైన్ మోసాల దర్యాప్తు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, ఆధునిక నేర పరిశోధనా పద్ధతులు వంటి నూతన యుగానికి సంబంధించిన అంశాలను ఇండక్షన్, ఇన్‌-సర్వీస్ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా చేర్చి, శిక్షణార్థులకు అవసరమైన పరిజ్ఞానం అందించాలని ఆదేశించారు.

అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోలీస్ శిక్షణలో అమలవుతున్న ఆధునిక బోధనా పద్ధతులు, ఆన్‌లైన్ శిక్షణా వేదికలు, కేస్ స్టడీలు, ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్లు, సిమ్యులేషన్ ఆధారిత శిక్షణా విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్ర పోలీస్ శిక్షణా సంస్థల్లో అన్వయించదగిన ఉత్తమ విధానాలను అమలు చేయాలని సూచించారు. పోలీసు సిబ్బందిలో సాంకేతిక నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యం, ప్రజలతో సమర్థవంతమైన సంభాషణ, సమస్యల పరిష్కార సామర్థ్యం, బాధ్యతాయుతమైన ప్రజాసేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్శనలో పీటీసీ ప్రిన్సిపాల్ డి. రామ చంద్ర రాజు , వైస్ ప్రిన్సిపాల్ డి. కోటేశ్వరబాబు ,    డి.యస్.పి. టి. రమేష్ , ఇన్స్పెక్టర్ లు, సబ్ ఇన్స్పెక్టర్ లు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.