BREAKING
గోకవరం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ ప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థిప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి టిడిపిలో చేరికలు అద్దంకిలో జోరుగా తెదేపా ప్రచారం.. గరటయ్య కాలనీలో ఇంటింటికీ తిరిగిన కాకాని అశోక్ సతీమణి పావని. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.* హైదరాబాద్, కామారెడ్డిలలో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు: రెండు వేర్వేరు కేసుల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్! సైదాపురంలో వైసీపీ తొలి ఎంపీటీసీ అభ్యర్థి ఖరారు కాంపా నిధులతో 10 లక్షల మొక్కల పెంపకం కడియం జడ్పిటిసి అభ్యర్థిగా శివాజీ

రుచులకు కొత్త చిరునామా.. * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌!

Select Suryaa Now
రుచులకు కొత్త చిరునామా..  * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌!

భోగాపురం, సూర్య : రుచికరమైన వంటకాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా భోజనం చేసే సౌకర్యం.. అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆహారం.. ఇవన్నీ ఒకే చోట లభించేలా భోగాపురం మండల కేంద్రంలో ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చింది. నలుగురు స్నేహితులు మాతా నవీన్, ముద్దన మురళి, ఇమ్మిడిశెట్టి గిరి, పల్లంట్ల శ్రీధర్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు.
భోగాపురం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయానికి సమీపంలో, జాతీయ రహదారిని ఆనుకుని ఈ రెస్టారెంట్‌ను ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో, ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఒకేచోట కూర్చుని ప్రశాంతంగా భోజనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్‌కు కూడా సదుపాయం కల్పించారు.
* రుచుల నుంచి వాతావరణం వరకు ప్రత్యేక శ్రద్ధ
భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలతో పాటు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన వంట మాస్టర్లతో నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి రుచికరమైన వంటకాలను సిద్ధం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా బిర్యానీతో పాటు ఇరానీ టీని అందించడం ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకతగా నిలవనుంది. హైదరాబాద్‌ చార్మినార్‌ ఇరానీ టీకి ఉండే ప్రత్యేక గుర్తింపును దృష్టిలో ఉంచుకుని, అదే తరహా టీ రుచిని స్థానికంగా అందించాలనే లక్ష్యంతో నిర్వాహకులు సిద్ధమయ్యారు.
* అందుబాటు ధరల్లో ఆతిథ్యం
నాణ్యమైన ఆహారాన్ని అందరికీ అందుబాటులో ఉండే ధరలకు అందించాలన్న ఉద్దేశంతో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికులతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించే వారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భోజన ప్రియులకు కూడా ఈ రెస్టారెంట్‌ అనుకూలంగా ఉండనుంది. రుచికి ప్రాధాన్యం ఇస్తూనే పరిశుభ్రత, నాణ్యత, ఆహ్లాదకరమైన వాతావరణంతో వినియోగదారులకు మంచి అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని నలుగురు స్నేహితులు పేర్కొన్నారు.
నూతనంగా ప్రారంభమైన ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌ భోగాపురం ప్రాంతంలో భోజన ప్రియులకు మరో మంచి ఎంపికగా నిలవనుంది.

రిపోర్టర్ : వై శ్రీనివాస రావు, భోగాపురం, విజయనగరం జిల్లా.