BREAKING
అట్టహాసంగావైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్ ఘనంగా నవరాత్రి వేడుకలు- తార్నాక లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్‌ లో కార్నివాల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం* గోకవరం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ ప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థిప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి టిడిపిలో చేరికలు అద్దంకిలో జోరుగా తెదేపా ప్రచారం.. గరటయ్య కాలనీలో ఇంటింటికీ తిరిగిన కాకాని అశోక్ సతీమణి పావని. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.* హైదరాబాద్, కామారెడ్డిలలో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు: రెండు వేర్వేరు కేసుల్లో మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్!

భక్తులకు టిక్కెట్లు -కళాకారులకు ఇక్కట్లు.

Select Suryaa Now
భక్తులకు టిక్కెట్లు -కళాకారులకు ఇక్కట్లు.

విజయనగరం (కల్చరల్), సూర్య : పట్టణంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి అని చెప్పవచ్చును.అని చెప్పడం కన్నా కళాకారులకు ఇక్కట్లు అని చెప్పడం మేలు అనిచెప్పక తప్పదు.ప్రతిఏటా కళాకారులు ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారు భక్తిభావం తో పాటు  సాటి కళాకారులకు అమ్మవారి ప్రసాదంగా భావించమని చెప్పే(ఇది రాతపూర్వకంగా ఉండేది) పారితోషికం లో కొంతయినా అందజేస్తే వారు అమ్మవారి దయగా స్వీకరించేవారు.కానీప్రతిఏటా ఈకార్యక్రమంలో పాల్గొనేవారు ఎప్పటి లోగా దరఖాస్తులు అందజేయాలన్న విషయం దేవస్థానం ప్రకటన ఉండదు.కళాకారులు వినాయక చవితి మరునాడు నుండి అందజేస్తే స్వీకరించడం పరిపాటి. వచ్చినవారిలో విరుద్ధం, చిన్నారులు,యువతతోపాటు దాదాపు అందరికీ ఈవిషయం లో  అవకాశం కల్పించి కొంత న్యాయం చేస్తారని చెప్పవచ్చు. కానీ వేదిక పై ఎక్కిన కళాకారుల అవస్థలు వర్ణనాతీతం.రైల్వేస్టేషన్ దారి వనంగుడి వద్ద వేదిక చిన్నది కావడం కళాకారులు పదిమంది వరకు ఎరక్కపోయి వచ్చాను.ఇరుక్కుపోయాను అని బాధపడడం సహజం.ఇక్కడ ప్రేక్షకుల సంఖ్య పదిమందికి ముగించారు.కూర్చోవడానికిజాగాఉండదు.కొందరు పాదచారులు.రోడ్ పైనుండి చూస్తారు.నాట్యాలు చూస్తే తకిటతథిమితందాన అంటూ ఎక్కడ గెంతాలో తెలియక అవస్థలు. ఇక చదురు గుడి వద్ద ప్రేక్షకులు దాదాపు ఏభై ఏళ్ల నుండి కుర్చీలకు అంటుకుపోయేవారున్నా.ఒకొక్కసారి ఎటువంటి కళాకారులు పాల్గొన్నా జనాలు పదుల సంఖ్యలో కానీ వస్తారు. ఇది సుమారు కనీసం ఇరవై రోజుల వరకు జరుగుతుంటుంది.ఇక్కడ కనీసం వ్రుత్తి కళాకారులు గాని పౌరాణిక ప్రదర్శన కళాకారులు గాని వేస్తే మేకప్ చేసుకోవడానికి స్థలం చూపకపోవడంతో ఒకవైపు కచేరి జరుగుతుండగా వేదిక మెట్ల వద్ద మేకప్ చేసుకుంటున్న కళాకారులను ప్రత్యక్షంగా ప్రేక్షకులు కూడా చూడగలరు.కనీసం ఏ కళాకారులు గురించి వేదికపై పరిచయం చేయడం గానీ కనీసం  మంచినీళ్లు అందించడం గాని దేవస్థానం సిబ్బంది ఎవరూ చేయరు.ఇక వారికి ఇష్టం వచ్చిన కళాకారులకు మాత్రం అప్పటి కప్పుడు ఎవరో వచ్చి పూలదండలు వేయడం , వారిగురించి (డబ్బా కొట్టడం) చేస్తారు. కళాకారులకు వారి కార్యక్రమాలు ముందుగా తెలియజేయడంలలో ముందుండం కొంత నయమని చెప్పవచ్చును.గతేడాదివరకు దేవస్థానం ఇచ్చే పారితోషికం చెప్పేవారు.ఈఏడాది ఆవిషయం తెలియక మేం ఎలా పెంచుకోవాలో తెలియడం లేదని కళాకారులు చెప్తున్నారు.వేదికపై కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పులి వేషాలు,డప్పులజయనాదాలు హోరు ‌భరించగలిగిన కళాకారులు మాత్రం కనీసం సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం విఫలమవుతోంది బాహాటంగా విమర్శిస్తున్నారు.

 

రిపోర్టర్ : కామేశ్వరరావు (కల్చరల్), విజయనగరం.