సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
నగరం, మేజర్ న్యూస్:
మండల కేంద్రమైన నగరం గిరిపురంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొలువుదీరిన అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో శుక్రవారం దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు.