BREAKING
యాసంగిలో వరి సాగును తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయండి కాంగోలో మారుతున్న తిరుగుబాటు వ్యూహాలు నల్లేరు కారం పొడితో కీళ్ల నొప్పులు పరార్.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయా? ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని ఘనముగా సరస్వతీ పూజ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు* ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్జా గింజలతో బరువు తగ్గుతారా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు! లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ సినిమాపై నాగార్జున స్పందన.. టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

సాయిబాబా ఆలయంలో 108వ ఆరాధనోత్సవాలు 6వ రోజు కు చేరిన ఉత్సవాలు

Select Suryaa Now
సాయిబాబా ఆలయంలో 108వ ఆరాధనోత్సవాలు 6వ రోజు కు చేరిన ఉత్సవాలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిర్డీ సాయి దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో శ్రీ షిర్డీ సాయిబాబా వారి 108వ ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామి వారికి మధురాభిషేకం నిర్వహించారు. తేనె, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెరలతో స్వామి వారికి అభిషేకం చేసిన అనంతరం సహస్రనామార్చన, విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

పూజల్లో పాల్గొన్న దంపతులు: 

ఈరోజు జరిగిన మధురాభిషేక పూజా కార్యక్రమంలో మద్దుల వెంకటరమణ-పద్మజ, 
చందలూరి రామకోటేశ్వరరావు-పద్మావతి, 
మద్దుల మహా వెంకటేశ్వరరావు-అనురాధ, 
తుంపూడి సాంబశివ వీర వెంకట శ్రీనివాసరావు -మోహన కుమారి, 
చన్న రామాంజనేయులు-నాగకృష్ణ, 
మద్దుల శ్రీరాములు-వెంకట పద్మావతి, 
వడ్లమూడి శివ నాగేశ్వరరావు-వెంకటేశ్వరమ్మ దంపతులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలను దేవస్థాన అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు, ఉపాధ్యక్షులు బట్టు రమేష్ బాబు, చెన్నగిరి పాపారావు, కార్యనిర్వాహక కార్యదర్శి జవ్వాది వెంకటేశ్వరరావు, కోశాధికారి బూరెల కిరణ్ కుమార్, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తటవర్తి అర్ధనారీశ్వరుడు, చందలూరి శివప్రసాద్, చందలూరి రామకోటేశ్వరరావు, చెన్న వెంకటేశ్వరరావు, కొన్నిపాటి వెంకటేశ్వరరావు తదితర కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆరాధనోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.