భట్టిప్రోలు మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు - ముసాయిదా జాబితా విడుదల
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను మండల పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించారు.2026 వ సంవత్సరం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. రోస్టర్ విధానం ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
గ్రామాల వారీగా రిజర్వేషన్ల వివరాలు:
జనరల్(యూఆర్) - 4 పంచాయతీలు:
ఐలవరం, కన్నెగంటివారిపాలెం, కొనేటిపురం, వెల్లటూరు గ్రామాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
జనరల్ మహిళ (యూఆర్-డబ్ల్యూ) - 4 పంచాయతీలు:
ఓలేరు, పల్లెకోన, పెదపులివర్రు, సూరేపల్లి గ్రామాలు జనరల్ మహిళలకు కేటాయించారు.
ఎస్సీ రిజర్వ్డ్- 2 పంచాయతీలు:
అల్లమూడి,పెసర్లంక గ్రామాలు షెడ్యూల్డ్ కులంకు కేటాయించగా,
ఎస్సీ మహిళ- 2 పంచాయతీలు:
పెదలంక, రాచూరు గ్రామాలు ఎస్సీ మహిళలకు కేటాయించారు.
ఎస్టీ రిజర్వ్డ్- 1 పంచాయతీ:
మండల కేంద్రమైన భట్టిప్రోలు పంచాయతీ ఎస్టీ కి కేటాయించడం విశేషం.
బీసీ, బీసీ మహిళ:
గొరిగేపూడి-బీసీ , చింతమోటు-బీసీ మహిళ గా ఖరారయ్యాయి.మండలంలో మొత్తం 15 పంచాయతీలకు గాను 4 జనరల్, 4 జనరల్ మహిళ, 2 ఎస్సీ, 2 ఎస్సీ మహిళ, 1 ఎస్టీ, 1 బీసీ, 1 బీసీ మహిళ రిజర్వేషన్లు కేటాయించినట్లు ఎంపీడీవో కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఈ ముసాయిదా జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లోగా వ్రా తపూర్వకంగా ఎంపీడీవో/తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు.రిజర్వేషన్ల ప్రకటనతో మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. ఆశావహులు తమ తమ గ్రామాల రిజర్వేషన్లను బట్టి వ్యూహాలు రచిస్తున్నారు.