కారాడ గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక:
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండలం కారాడ గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలు శుక్రవారం టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.ఈ మేరకు
కర్రి వెంకటేష్, మాజీ కో-ఆపరేటివ్ ప్రెసిడెంట్ చెలికాని రాజగోపాల్, మాజీ సర్పంచ్ ప్రతినిధి చొక్కపు సంజీవ్ నాయుడు, మాజీ సర్పంచ్ వాకాడ త్రినాధ్, మాజీ ఎంపీటీసీ ప్రతినిధి డోకుల తిరుపతిరావు ఆదరణతో, బొబ్బిలి మాజీ శాసనసభ్యులు, బొబ్బిలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ దత్తి సత్యనారాయణ, రేజేటి పోలీసు, గర్భాపు అప్పారావు తదితరులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. శంబంగి వెంకట చిన అప్పలనాయుడు నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శంబంగి వేణుగోపాల్ నాయుడు, బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, తెర్లాం మండల అధ్యక్షులు తెంటు సత్యం నాయుడు, బొబ్బిలి పట్టణ పార్టీ అధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, బాడంగి జడ్పిటిసి పెద్దింటి రామారావు, మరియు నలుగు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.