సూర్య తిర్యాణి : తిర్యాణి, వర్షాలు కురవాలని కోరుతూ మండలంలోని రొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సత్తిగూడలో గిరిజనులు కప్పతల్లి ఊరేగింపు నిర్వహించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాల కోసం పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ గ్రామంలో కప్పతల్లిని ఊరేగించారు. సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు