BREAKING
టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్! ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే శరన్నవరాత్రులు తాగునీటి కష్టాలు తీర్చాలంటూ ఖాళీ బిందెలతో మహిళల రోడ్డు ధర్నా మద్దనకుంట సర్పంచ్ రేసులో బి ఎల్ ఆర్ శకుంతలమ్మ వీరక్యాతరాయ మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన డా. రాజాన సత్యనారాయణ జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగల అనూషకు అవకాశం కల్పించాలని వినతి ఏపీలో పరిస్థితులను కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం అలూర్‌–ధని గ్రామాల మధ్య నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన పెనుగొండలో పెను విషాదం బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ సరస్వతీ దేవి అలంకారంలో విశాలాక్షి అమ్మవారుదేవీ నవరాత్రుల ఆరో రోజు భక్తులకు జ్ఞానప్రదాయిని దర్శనం పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లక్ష్మీ నర్సయ్య ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. కరోనా కంటే ఎల్ నినో ప్రభావం ప్రమాదకరం విద్యుత్ పొదుపుతో బిల్లుల భారం తగ్గించుకోవాలి - ఎస్ఈ ఉత్తమ్ జాడే క్రీడలతో మానసిక ఒత్తిడికి దూరం.... ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

Select Suryaa Now
వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( అక్టోబర్ 15): వర్షపు నీరు వృథా కాకుండా సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు వీబీ జీ రామ్ జీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ మండలం గోదుమగూడ గ్రామంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన వివిధ పనులను ఆయన సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గ్రామంలో చేపట్టిన ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ పనులు, పైకప్పు వర్షపు నీటి సేకరణ, వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వీబీ జీ రామ్ జీ పథకం కింద చేపట్టే పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ ఆవరణల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వికారాబాద్ మండలంలో మంజూరైన 72 ఫామ్ పాండ్లు, 47 బోర్‌వెల్ రీచార్జ్ పనులు, 16 పైకప్పు వర్షపు నీటి సేకరణ పనులు, 119 వ్యక్తిగత, 33 సామూహిక ఇంకుడు గుంతల లక్ష్యాలను అధిగమించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.ఈ పర్యటనలో డీఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీవో వినయ్ కుమార్, సర్పంచ్ స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి ఇందిర, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.