మద్దనకుంట సర్పంచ్ రేసులో బి ఎల్ ఆర్ శకుంతలమ్మ వీరక్యాతరాయ
అమరాపురం మేజర్ న్యూస్ 16: మండల పరిధిలోని మద్దనకుంట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఇక్కడి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు, సత్యసాయి జిల్లా కుంచిటిగ వక్కలిగ సంఘం అధ్యక్షుడు బి ఎల్ ఆర్ వీరాగ్యతరాయ సతీమణి శకుంతల (శిల్ప) ఆశావహులుగా రేసులో నిలిచారు. గత కొన్ని ఏళ్లుగా బి ఎల్ ఆర్ వీరక్యతరాయప్ప కుటుంబం అమరాపురం మండలంలో పార్టీ బలోపేతానికి, అలాగే కుంచిటిగ వక్కలిగ సామాజికవర్గ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మద్దనకుంట పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శకుంతలమ్మను సర్పంచ్ బరిలో నిలపాలని స్థానిక నాయకులు, కార్యకర్తలు బలంగా కోరుతున్నారు. పార్టీ అధిష్ఠానం ఆశీస్సులు, నియోజకవర్గ ముఖ్య నేతల మద్దతుతో తమకు అవకాశం దక్కుతుందని, పంచాయతీ ప్రజల అండతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని బి ఎల్ ఆర్ శకుంతల వీరక్యతరాయ ధీమా వ్యక్తం చేశారు.
అమరాపూరాం రిపోర్టర్ సిద్దేశ్వర