BREAKING
వైసీపీ నేతలే రెచ్చగొట్టారు.. బాధితురాలికి మొబైల్‌ ఫోన్‌ అప్పగింత ఎన్నికల భద్రతపై ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన పీటీసీ సందర్శించిన డీఐజీ విశాల్ గున్ని అంతంపల్లి దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం మృతి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా మామిడి గుండాల భూముల రీ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఎన్నికల కమిషన్ల ను రద్దు చేయాలి..... *2023 ఎన్నికల కమీషన్ చట్టాన్ని రద్దు చేయాలి ఫామ్ ఫండ్  ఉపాధి హామీ పనులు ప్రారంభం నామినేషన్ పత్రాల కోసం వైసిపి చైర్మన్ అభ్యర్థి హర్షిని మున్సిపల్ కార్యాలయంలో బైఠాయింపు. మడ్డువలసలో వీధి కుక్కలు కలకలం భయాందోళనలో స్థానిక ప్రజలు కృత్రిమ మేధస్సు షేర్ల క్షీణత మరియు బాండ్ల మార్కెట్ పరిణామాలు అమీనాపూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం - ఆరుగురిపై దాడి *ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు.... *నామినేషన్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి పోప్ సిఫ్రియన్ ఆరోగ్య పరిస్థితిపై వాటికన్ కీలక ప్రకటన

బూర్గులలో తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు...

Select Suryaa Now
బూర్గులలో తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు...

రూ.15 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శ్రీకారం…

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్….

ఫరూఖ్‌నగర్, రంగారెడ్డి:

బూర్గుల గ్రామంలో నూతనంగా తెలంగాణ మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో ఎమ్మెల్యే వీర్లపల్లి పర్యటించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి తదితరులతో కలిసి గ్రామంలో 15 లక్షల నిధులతో అండర్ డ్రైనే జ్ పన్నులను ప్రారంభించారు అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ  రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా బూర్గుల గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. 

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బూర్గుల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో 31 ఇళ్లు, రెండో విడతలో 14 ఇళ్లు మంజూరు చేశామని, మొత్తం 45 ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించామని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు.  బూర్గుల గ్రామ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతి త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడటంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు పంట నష్టం జరగకుండా ఉండేందుకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రతిరోజూ అదనంగా మూడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరినట్లు తెలిపారు. అదనపు విద్యుత్ సరఫరాతో రైతులకు సాగునీటి అవసరాలు తీరి, పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, విద్య, రవాణా, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల్‌రాజ్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కొత్తూరు టౌన్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సర్పంచులు యాదగిరి, రాజగోపాల్ రెడ్డి, వడ్ల జంగయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగారి రవి, తాలూకా ఎస్టీ సెల్ అధ్యక్షుడు గణేష్, నాయకులు ముబారక్ అలీ ఖాన్, కుమార్ నాయక్, వెంకటేష్, నర్సప్ప గూడ క్రిష్ణ, శ్రీనివాస్ రెడ్డి, బూర్గుల మాజీ సర్పంచ్ శివకుమార్,గ్రామ అధ్యక్షుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.. 

 

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్….