BREAKING
ఎన్నికల కేంద్రాల్లో మౌలిక వసతులు, సదుపాయాలు ముందుగానే పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి.... ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమే విజయానికి నాంది. బతుకమ్మ వేడుకలకు ముస్తాబు భారత్‌ ఐటీ రంగానికి స్వల్ప బిగ్‌ షాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను వేలం వేయడం చట్టరీత్యా నేరం* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలి మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగాలి... సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు ప్రత్యేక పూజలు వీరిలో చైర్ పర్సన్ అభ్యర్థిత్వం ఎవరిని వరించెనో ? భీమ్‌గల్ లో వ్యక్తి ఆత్మహత్య పెద్ది చిత్రంలోని ఎమోషనల్ ఆసుపత్రి సన్నివేశంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎనిమిది గంటల్లోనే పూర్తి పార్వతీపురంలో ఘనంగా "వస్త్ర జగదాంబ" జాకీ బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కొత్తగూడలో ఘనంగా కుంకుమ పూజ

టైర్ల పరిశ్రమల పొగతో ప్రజలకు ముప్పు!మల్లేపల్లి శివారులో యథేచ్ఛగా రీసైక్లింగ్‌.. కాలుష్యంతో పంటలకు నష్టంనిబంధనలు గాలికి.. పట్టించుకోని అధికారులు?కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్‌

Select Suryaa Now
టైర్ల పరిశ్రమల పొగతో ప్రజలకు ముప్పు!మల్లేపల్లి శివారులో యథేచ్ఛగా రీసైక్లింగ్‌.. కాలుష్యంతో పంటలకు నష్టంనిబంధనలు గాలికి.. పట్టించుకోని అధికారులు?కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్‌

కొండాపూర్‌ ;మండల పరిధిలోని మల్లేపల్లి శివారులో కొనసాగుతున్న టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, టైర్‌ పౌడర్‌తో గాలి, వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత టైర్లను కాల్చి నూనె, వైర్లు, టైర్‌ పౌడర్‌ను వేరు చేసే ప్రక్రియలో వెలువడే పొగ చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యానికి, వ్యవసాయ పంటలకు ముప్పుగా మారుతోంది పొగతో ఉక్కిరిబిక్కిరి.. పంటలపై కాలుష్య ప్రభావం!మల్లేపల్లి శివారులో సుమారు 8నుంచి 10 వరకు టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమలు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాత టైర్లను కాల్చి వాటి నుంచి నూనె, వైర్లను వేరు చేసి, మిగిలిన టైర్‌ పౌడర్‌ను లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియలో వెలువడే పొగతో పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లపై టైర్‌ పౌడర్‌ పేరుకుపోయి నల్లగా మారుతున్నాయని, పంట పొలాలపై కాలుష్య ప్రభావం పడుతోందని రైతులు వాపోతున్నారు.రోడ్లు ధ్వంసం.. ప్రజారోగ్యంపై ఆందోళన!టైర్‌ పౌడర్‌ను తరలించే భారీ వాహనాల రాకపోకలతో రహదారులు దెబ్బతింటున్నాయి పరిశ్రమల నుంచి వెలువడే పొగ, ధూళి కారణంగా పరిసర గ్రామాల ప్రజలు శ్వాసకోశ సమస్యలు సహా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టైర్లను కాల్చడం వల్ల వెలువడే హానికర ఉద్గారాలపై సమగ్ర పరిశీలన జరిపి, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉందో అధికారులు నిర్ధారించాలని కోరుతున్నారు.ఫిర్యాదులు చేసినా స్పందనేదీ?పరిశ్రమల నిర్వహణలో కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై గతంలో వార్తా కథనాలు ప్రచురించినా, అధికారులకు ఫిర్యాదులు చేసినా తగిన స్పందన కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతున్నాయా లేదా అన్నది అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.కాలుష్య నియంత్రణ మండలి స్పందించాలి!కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మల్లేపల్లి శివారులోని టైర్ల రీసైక్లింగ్‌ పరిశ్రమలను తక్షణమే తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే పొగ, గాలి నాణ్యత, వ్యర్థాల నిర్వహణ, పంట పొలాలపై పడుతున్న ప్రభావాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నిర్వహిస్తున్నట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, రైతుల పంటలను, పర్యావరణాన్ని కాపాడేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.