BREAKING
తొలి రోజు ప్రారంభమైన నామినేషన్ లు:.. టిడిపి నామినేషన్ లు నాలుగు, ఇండిపెండెంట్ లు రెండు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి ఎల్.కోట శ్రీ సీతారామ స్వామి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రులు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కరీనా ఆ వింత అలవాటు వల్ల మా బెడ్‌రూమ్ రాత్రిపూట దాబా లాగా మారుతుంది.. సైఫ్ అలీ ఖాన్ సరదా కామెంట్స్ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు.... కేశంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరిక లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటండి... ఎమ్మెల్యే " కోండ్రు " కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పనిచేయాలి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా నాంపెల్లి రాజ్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక స్కూల్ గ్రాంట్ల చెల్లింపుల్లో గందరగోళం... పాత విధానంలోనే ఎస్‌ఎంసీ ఖాతాల్లో నిధులు జమ చేయాలి అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. తాసిల్దార్. కార్పొరేటర్ అభ్యర్థిగా రేవళ్ళ సత్యనారాయణ నామినేషన్ రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడిగా కోట వేణు ఎన్నిక విద్యాలక్ష్మిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు...!

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమే విజయానికి నాంది.

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం  అభివృద్ధి, సంక్షేమమే విజయానికి నాంది.

హనుమాన్ జంక్షన్, మేజర్ న్యూస్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సూచనల మేరకు హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డులో శుక్రవారం బాపులపాడు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం దయాల రాజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై నాయకులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మూల్పూరి సాయికళ్యాణి, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, హనుమాన్ షుగర్స్ మాజీ ఛైర్మన్ గుండపనేని ఉమావరప్రసాద్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్ తదితరులు మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వంలో గత రెండున్నరేళ్లుగా గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయ లక్ష్యంతో పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఉన్నందున, అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గండేపూడి నితీష్ కుమార్, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు చింతల వెంకట అప్పారావు, క్లస్టర్ ఇన్‌ఛార్జి కలపాల కుమార్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు రాజులపాటి నాగరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దాసరి రాజేష్, మండలంలోని వివిధ గ్రామాల టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి:: గుర్రం ప్రసాద్, గన్నవరం, కృష్ణా జిల్లా.