BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

ఎల్.కోట శ్రీ సీతారామ స్వామి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రులు

Select Suryaa Now
ఎల్.కోట శ్రీ సీతారామ స్వామి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రులు

లక్కవరపు కోట, సూర్య :  ఎల్ కోట మేజర్ పంచాయతీ లో గల  శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర దినాన జగన్మాత జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్వేత వస్త్రాలు, వీణాపాణిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ​ఈ వేడుకల్లో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులుఅక్కా జోస్యుల శ్రీ హరి శర్మ వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, ప్రత్యేక వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
​ఈ సందర్భంగా  శ్రీ హరి శర్మ సామూహిక అక్షరబ్యాస కార్యక్రమం నిర్వహించారు   ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరిపై జగన్మాత చల్లని చూపు ఉండాలని, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గురు బృందం సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట,  విజయనగరం జిల్లా.