BREAKING
జనసేన సిద్ధాంతాలే మా బలం.. కూటమి ధర్మాన్ని పాటిస్తూ పోటీకి సిద్ధం! అట్టహాసంగావైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి నామినేషన్ ఘనంగా నవరాత్రి వేడుకలు- తార్నాక లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్‌ లో కార్నివాల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం* గోకవరం చెక్పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బంగారు బతుకమ్మ వేడుకలు షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్ ప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థిప్రభుత్వ విప్ నాయకర్ ని కలిసిన మున్సిపల్ చైర్‌పర్సన్ కూటమి అభ్యర్థి టిడిపిలో చేరికలు అద్దంకిలో జోరుగా తెదేపా ప్రచారం.. గరటయ్య కాలనీలో ఇంటింటికీ తిరిగిన కాకాని అశోక్ సతీమణి పావని. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది…కాంగ్రెస్ హామీలన్నీ నీటిమీద రాతలే!. నకిలీ భూ పత్రాలతో స్థలం విక్రయానికి యత్నం.. ఇద్దరు అరెస్ట్‌ దేశం నేత నాయుడుని కలిసిన కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శైలజ విజయం నీదా? నాదా?* *ఎన్నికల రిజర్వేషన్ తో వేడెక్కిన కుందుర్పి మండల రాజకీయాలు.*

స్కూల్ గ్రాంట్ల చెల్లింపుల్లో గందరగోళం... పాత విధానంలోనే ఎస్‌ఎంసీ ఖాతాల్లో నిధులు జమ చేయాలి

Select Suryaa Now
స్కూల్ గ్రాంట్ల చెల్లింపుల్లో గందరగోళం... పాత విధానంలోనే ఎస్‌ఎంసీ ఖాతాల్లో నిధులు జమ చేయాలి

లక్కవరపుకోట, సూర్య : పాఠశాల గ్రాంట్ల చెల్లింపులకు సంబంధించి అమలు చేస్తున్న ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్ విధానంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించి, గతంలో మాదిరిగానే పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఖాతాల్లో నిధులు జమ చేసే విధానాన్ని కొనసాగించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు పెంటపల్లి వాసు కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలు, ఇతర నిర్వహణ కార్యక్రమాల కోసం ప్రధానోపాధ్యాయులు తమవంతుగా ఖర్చులు చేయడం, అనంతరం సంబంధిత బిల్లులను సమర్పించి ఆ మొత్తాన్ని పొందడం సాధారణంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత విధానంలో వెండర్లను వెతికి, వారి ఖాతాల్లో నగదు జమ చేయడం, తిరిగి వారి నుంచి అవసరమైన మొత్తాన్ని పొందే పరిస్థితులు తలెత్తడం ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాంట్ల నిర్వహణ కోసం ఎస్‌ఎంసీ కమిటీ, దానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ, ఆ ఖాతాలో కాకుండా వెండర్ల ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి రావడం అనేక సందేహాలకు, గందరగోళానికి దారితీస్తోందన్నారు. ఈ విధానం ఎంతవరకు సమంజసమో అధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగానే ఎస్‌ఎంసీ ఖాతాలో లేదా నిబంధనలకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయుల ఖాతాలో నిధులు జమ చేసి, బిల్లులు సమర్పించే విధానాన్ని పునరుద్ధరించేలా అవసరమైన సవరణలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న విధానంలో బిల్లుల సమర్పణకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువును కూడా పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
దసరా సెలవుల సమయంలోనూ బిల్లుల వ్యవహారాల కోసం ఎంఆర్‌సీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుమ్మడి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా, ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పడకుండా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

రిపోర్టర్ : గోవింద్, ఎల్ కోట,  విజయనగరం జిల్లా.