BREAKING
రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పట్టణంలోని 30 కుటుంబాలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష విశాఖ మేయర్‌ బరిలోకి అనుప్రియ...! శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా మూలా నక్షత్ర వేడుకలు

లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు

Select Suryaa Now
లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు

సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తో కలిసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన నూతన బార్ ను లక్కీ లాటరీ పద్ధతిలో కేటాయింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి నూతన బార్ అండ్ రెస్టారెంట్ మంజూరు కాగా, ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, మొత్తం 207 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారి సమక్షంలో లక్కీ లాటరీ పద్ధతిన 102 నెంబరు గల మల్లు గారి రమేష్ గౌడ్ ను లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బార్ నిర్వహణలో ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటిస్తూ, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ మధ్య నిషేధశాఖ అధికారి లక్ష్మీ నాయక్, సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.