BREAKING
వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పట్టణంలోని 30 కుటుంబాలు

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి

Select Suryaa Now
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి

సూర్య రాజన్న సిరిసిల్ల,భారత ప్రభుత్వం, ఆర్థిక సేవల విభాగం (DFS) ఆదేశాల మేరకు 21.10.2026 నుంచి  31.12.2026 వరకు జిల్లాలోని గ్రామపంచాయతీలు, అన్ని మున్సిపాల్టీల పరిధిలో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ మోసాల నుంచి రక్షణపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.భారత ప్రభుత్వం, ఆర్థిక సేవల విభాగం (DFS) ఆదేశాల మేరకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజీవ్ కుమార్ తో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY),అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాల (PVTG) ల పై జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు అలాగే మున్సిపాలిటీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నూతన బ్యాంక్ ఖాతాలు తెరవడంపై షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.పీ ఎం జే డీ వై,  ఇతర సేవింగ్ ఖాతాలకు రీ కే వై సీ చేయించడం, పెండింగ్ లో ఉన్న చోట సీ కే వై సీ చేయించడం, సేవింగ్ ఖాతాలు, లాకర్ల వంటి వాటిలో నామిని తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆర్థిక పథకాలు, డిజిటల్ మోసాల  నుంచి ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు.