BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు.... కేశంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరిక

Select Suryaa Now
నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష తప్పదు.... కేశంపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరిక

మేజర్ న్యూస్ షాద్ నగర్;;ఎక్కడైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కేశంపేట్ మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీటర్లను పిలిచి ప్రస్తుత వారి చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కేశంపేట సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, చట్టాన్ని గౌరవిస్తూ సాధారణ పౌరులుగా జీవించాలని  సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని కఠినంగా మందలించారు. ప్రజల భద్రతే ధ్యేయంగా అనుమానిత వ్యక్తుల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ సందర్భంగా నేర  చరిత్ర ఉన్న వాళ్లకు ఎస్సై పరమేష్ పలు సూచనలు చేశారు.

జవాజి రాఘవేంధర్ గౌడ్: మేజర్ న్యూస్ షాద్ నగర్