BREAKING
వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న పట్టణంలోని 30 కుటుంబాలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష

విజయనగరం లో తొలిరోజు 18 నామినేషన్లు

Select Suryaa Now
విజయనగరం లో తొలిరోజు 18 నామినేషన్లు

విజయనగరం, సూర్య : నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు కార్యాలయం నందు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరిగింది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ ప్రక్రియలో మొత్తం 19 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మేయర్ అభ్యర్థిగా ఒకరు నామినేషన్ దాఖలు చేయగా, వార్డు మెంబర్లుగా 18 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందుకోసం కార్యాలయం మొదటి అంతస్థులో 8 కౌంటర్లు, రెండవ అంతస్తులో 8 కౌంటర్లు, 1 మేయర్ అభ్యర్థి కౌంటర్ ను ఏర్పాటు చేశారు. నామినేషన్ ప్రక్రియకు ముందు కమిషనర్ బాలస్వామి అన్ని కౌంటర్ల వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మరో రెండు రోజులపాటు జరగనుందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశించిన నిబంధనలకు లోబడి నామినేషన్ దాఖలుకు అవసరమైన అన్ని పత్రాలను అభ్యర్థులు సిద్ధం చేసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రానికి అనగా నగరపాలక సంస్థ కార్యాలయానికి నిర్దేశించిన 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితో సహా మరో ఇద్దరిని మాత్రమే అనుమతించబడునని తెలిపారు. ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారి పట్ల వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అందరి సమన్వయంతో ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.