కార్పొరేటర్ అభ్యర్థిగా రేవళ్ళ సత్యనారాయణ నామినేషన్
సింధియా, సూర్య : రానున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 81వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవల్ల సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ సమర్పించారు. మాజీ సైనికుల కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి భారీ జనసందోహం మధ్య పాదయాత్రగా బయలుదేరారు. ములగాడ హౌసింగ్ కాలనీ, వాయుపుత్ర కాలనీ, హనుమాన్ నగర్, నెహ్రూ నగర్, నక్కవానిపాలెం, గాజువాక డిపో మీదుగా శాంతి గిరి కాలనీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ సందర్బంగా రేవల్ల సత్యనారాయణ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మళ్ల విజయప్రసాద్ ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని గత ముప్పై ఏళ్లుగా ప్రజానాయకుడిగా తనకు ఉన్న అనుభవంతో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని అందుకుగాను రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తూ పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకు, మహిళలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పివి సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెంటారావు, పూండి మల్లేశ్వరరావు, వైసిపి వివిధ విభాగాల నాయకులు పాల్గొని రేవల్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ : మనోజ్, మల్కాపురం, విశాఖపట్నం.