స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటండి... ఎమ్మెల్యే " కోండ్రు "
రాజాం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటాలని మాజీ మంత్రి,రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాజాం మండలం శ్యాంపురం తెదేపా క్యాంప్ కార్యాలయంలో రాజాం రూరల్,వంగర మండలాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసిందన్నారు. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ గా నిలిచాయన్నారు.ఒక్క రాజాం నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి,సంక్షేమం జరుగుతుందన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన అనతికాలంలోనే గ్రామాల స్వరూపాలు పూర్తిగా మారాయన్నారు.అడుగడుగునా బీటీ,సీసీ రోడ్లు, కాలువలతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రతీ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామన్నారు.అనంతరం ఆగూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోనారి గంగునాయుడుతో పాటు పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.వీరిని సాదరంగా స్వాగతం పలికి పార్టీ కండువాలు ఎమ్మెల్యే వేశారు.స్థానిక సంస్థల గెలుపులో భాగస్వామ్యం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో బొత్స వాసుదేవరావు నాయుడు,గురవాణ నారాయణ రావు,పిన్నింటి మోహన రావు,దుప్పల పూడి శ్రీను, లచ్చుభుక్త కృష్ణమూర్తి,ఎలకల దుర్గబాబు,త్రినాథ, రఘుమండల గణపతి తదితర కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె జె చక్రధరి, రాజాం, విజయనగరం జిల్లా.