కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పనిచేయాలి
కనిగిరి ,మేజర్ న్యూస్ :;గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు ,కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని విశాఖపట్నం పార్లమెంట్ వైసీపి పరశీలకులు ,మాజీ ఎమ్యెల్యే కదిరి బాబురావు అన్నారు.విశాఖపట్నం కార్పోరేషన్ కార్పొరేటర్ల ఎంపిక వైసీపి కార్యాలయంలో శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా కదిరి బాబురావు మాట్లాడుతూ గత వైసీపి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన సంక్షేమ పథకాలను ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని చెప్పారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు వర్గ విబేధాలు విడనాడి వైసీపి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.వైసీపి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు ,కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చి వారి అభివృద్ధికి మాజీ సియం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రిజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నకబాబు ,వైసిపి జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు ,మాజీ మంత్రులు గుడివాడ అమర్నాధ్ ,బాలరాజు ,వైసీపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు .